Tuesday, May 6, 2025
- Advertisement -

ఏపీ ఏమైనా నార్త్ కొరియానా…..? టీడీపీ ప్ర‌భుత్వంపై విరుచుకు ప‌డిన వ‌ర్మ‌

- Advertisement -

ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుద‌ల కానున్న‌నేప‌థ్యంలో ఈ సినిమాకు సంబంధించి విజయవాడలో మీడియా సమావేశం పెట్టకుండా తనను పోలీసులు అడ్డుకోవడంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. ఏపీని పోలీస్ రాజ్యంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.విజయవాడలో సమావేశం పెట్టడానికి వీల్లేదు అంటే ఆంధ్రప్రదేశ్ లోకి రాకూడదు అని అర్థమా? విజయవాడ ఏమైనా నార్త్ కొరియానా? ఏపీకి రావాలంటే మేం వీసాలు తీసుకోవాలా? అని వర్మ ప్రశ్నించారు.

హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈరోజు నిర్వహించిన మీడియ సమావేశంలో వర్మ టీడీపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. ప్రెస్‌మీట్‌ కోసం నేను విజయవాడ వెళితే నన్ను అరెస్టు చేసి నగరం విడిచి పెట్టి వెళ్లాలని కోరారని, కానీ ఎందుకంటే మాత్రం సమాధానం చెప్పడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విజయవాడలో నేనుండడానికి వీలులేదని పోలీసులు బెదిరించడం చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అని అనిపించిందని, విజయవాడ ఏమైనా వేరే దేశమా? అని వర్మ ప్రశ్నించారు. వచ్చే నెల 1న ఏపీలో విడుదల కానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అందరూ చూడాలని వర్మ ఈ సందర్భంగా కోరారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -