కూటమి సర్కార్ తీరుపై ఏపీ మైనారిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే హజ్ యాత్ర పాయింట్ తొలగించారని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో వైయస్ఆర్‌సీపీ హయాంలో కష్టపడి విజయవాడ పాయింట్ సాధించామని అంజాద్ బాషా వెల్లడించారు.
మైనార్టీలను చంద్రబాబు సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో కూడా హైదరాబాద్ పాయింట్ నుండి హాజీలు యాత్రకు వెళ్లారు. అయితే అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర హజీలకు సరైన సదుపాయాలు కల్పించలేదు. ఆ తర్వాత మన రాష్ట్రం నుండే హజీలను హజ్ యాత్రకు పంపించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకుని వెళ్లామని గుర్తు చేశారు.
జగన్ విజ్ఞప్తితో విజయవాడ పాయింట్ నుండి 1813 మంది హజ్ యాత్రకు వెళ్లారు. అదనపు భారాన్ని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఉత్తర్వులు జారీచేసిందని చెప్పారు. ఇంత కష్టపడి సాధించిన యాత్ర పాయింట్‌ను తీసేయడం బాధాకరం. ఇది కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమే. మైనార్టీ వర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విస్మరించారు అని మండిపడ్డారు అంజాద్ బాషా. బీజేపీపై ప్రేమతో మైనారిటీలను నిర్లక్ష్యం చేయడం తగదని పలువురు మండిపడుతున్నారు.
