రామ్‌గోపాల్ వర్మ ఊముహూర్తానా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మొదలు పెట్టాడో గాని మొదటి నుంచి ఆటంకాలు ఎదరవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఈ సినిమా విడుదల అయితే టీడీపీకీ డ్యామేజ్ తప్పదని సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు. ఎన్నికల కమిషన్‌కు ఓ టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన సూచనలతో సెన్సార్ బోర్డ్ ఎన్నికల తరువాత విడుదల చేసుకోమని చెప్పడంతో వర్మా న్యాయపోరాటం చేస్తానని చెప్పడంతో సినిమా విడుదలపై ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికలకు ముందే సినిమాను ఎట్టి పరిస్థితుల్లోను విడుదల చేయాలని వర్మ పట్టుదలతో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతున్నాడు వర్మ. సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించుకున్న వర్మ ఈ సినిమాను బుధవారం రోజున సినిమాను సెన్సార్ క్లియరెన్స్ కు పంపించనున్నారు. క్లియరెన్స్ వస్తే సినిమాను విడుదల చేయనున్నారు. సెన్సార్ చేసి మార్చి 22 న రిలీజ్ చేయడం కుదరదు కాబట్టి సినిమాను మార్చి 29 కు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోను ఈనెల 29న సినిమాను విడుదలచేసేందుకు సిద్దంగా ఉన్నారు.
- Advertisement -
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై వెనక్కి తగ్గని వర్మ…..రిలీజ్ ఎప్పుడంటే..?
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -