లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీకి పరిచియం అయింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫెయిల్ అయినప్పటికి సినిమాలో లావణ్య నటనకు మంచి పేరు వచ్చింది.ఈ సినిమా చూసినవారు లావణ్య పెద్ద హీరోయిన్ అవుతుందని భావించారు. ఎందుకనో అనుకున్నంత సక్సెస్ కాలేదు లావణ్య.ఒక హిట్ పడితే రెండు ఫ్లాప్‌లుగా అమ్మడు కెరీర్ సాగుతుంది.
నాగర్జనతో నటించిన సోగ్గాడే చిన్ని నాయనా,నానితో భలే భలే మగాడడివోయ్ సినిమాలు హిట్ కొట్టిన,వరణ్ తేజ్,నాగ చైతన్య,సాయి ధరమ్ తేజ్ ఇలా కుర్ర హీరోలతో తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ల్‌లే.ఇప్పుడు ఈ భామ మరో కుర్ర హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది.వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో నిఖిల్ పక్కన హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది.కిర్రాక్ పార్టీ తరువాత నిఖిల్ మరో రీమేక్ సినిమాతో రానున్నాడు.
కనిథన్ అనే తమిళ్ సినిమాను తెలుగులో ఒరిజినల్ దర్శకుడు సంతోష్ తెరకెక్కిస్తున్నాడు. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా కేథరీన్ తీసుకుందామని అనుకున్నారు.కాని నిఖిల్ పక్కన కేథరీన్ అయితే పెద్దదిగా కనిపిస్తుందని ఆలోచించి లావణ్యని తీసుకున్నారు.మరి నిఖిల్ అయిన లావణ్యకు హిట్ ఇస్తాడో లేదో చూడాలి.లావణ్య ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘వ్యోమగామి’లో కూడా లావణ్య నటిస్తోంది.