టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి తాజాగా తమిళ ఇండస్ట్రీలోని కొందరిని టార్గెట్ చేసుకుని వివాస్పద కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ జాబితాలో లారెన్స్ పేరు కూడా వుంది.తాజాగా ఆయన శ్రీరెడ్డి చేసిన విమర్శలపై స్పందించారు. శ్రీరెడ్డి ఆరోపణలలో ఎంతమాత్రం వాస్తవం లేదు. ‘రెబల్’ సినిమా సమయంలో ఆమె నన్ను కలిసింది .. ఆ సినిమా వచ్చి దాదాపు ఏడేళ్లు అయింది .. ఇంతవరకూ ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఆ సమయంలో హోటల్లోని నా రూములో దేవుళ్ల ఫోటోలు .. రుద్రాక్ష మాలలు ఉన్నాయని చెప్పింది.
హోటల్ రూమ్ లో అవన్నీ పెట్టుకోవడానికి నేనేమైనా పిచ్చివాడినా? శ్రీరెడ్డి తన టాలెంట్ ను నిరూపించుకుంటే అవకాశం ఇవ్వడానికి నేను సిద్ధంగా వున్నాను. ఆమె పరిస్థితి పట్ల నేను జాలి పడుతున్నానే గానీ .. భయపడటం లేదు” అంటూ స్పష్టం చేశాడు. శ్రీరెడ్డి ఆరోపణలను గురించి అంతా నన్ను అడుగుతున్నారు .. అదే పనిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దాంతో ఈ వివాదానికి ముగింపు పలకాలని అనుకుంటున్నాను.శ్రీరెడ్డిని చూస్తుంటే నాకు కోపం రావడంలేదని, జాలేస్తుందని టాలెంట్ నిరుపించుకుని అవకాశాలు పొందాలి కాని ఇలా అడ్డదారులలో కాదని శ్రీరెడ్డికి హితవు పలికాడు లారెన్స్.