Saturday, May 10, 2025
- Advertisement -

ఎన్టీఆర్ అభిమానుల‌ను బుట్ట‌లో ప‌డేస్తున్న మంచు మ‌నోజ్‌

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌ల వేడి మొదలైంది. అన్ని రాజ‌కీయ పార్టీలు గెలుపు కోసం తెగ కృషి చేస్తున్నాయి. మంచు ఫ్యామిలీ కూడా ప‌రోక్షంగా వైసీపీ పార్టీకి సాయం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వైఎస్ జ‌గ‌న్ కుటుంబంతో మంచు ప్యామిలీకి మంచి అనుబంధం ఉంది. దీంతో వారు చంద్ర‌బాబుపై వార్‌కు దిగుతున్నారు. ఇటీవ‌లే మోహ‌న్ బాబు త‌మ కాలేజీల ఫీజు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వనికి వ్య‌తిరేకంగా ధ‌ర్నా కూడా నిర్వ‌హించారు. ఈ ధర్నాలో మంచు విష్ణు, మంచు మ‌నోజ్‌లు కూడా పాల్గోన్నారు. అయితే మంచు ఫ్యామిలీకి వైసీపీ వ్య‌తిరేకంగా ఉన్న ఇటువంటి త‌రుణంలో మ‌నోజ్‌కు ఊహించని ప్ర‌శ్న ఎదురైంది. ఓ అభిమాని ట్విట్ట‌ర్ వేదిక‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే మీరు అత‌నికి మ‌ద్ద‌తనిస్తారా అంటూ మ‌నోజ్‌ను ప్ర‌శ్నించాడు. దీనితో అదిరిపోయే అన్స‌ర్ ఇచ్చాడు మ‌నోజ్‌. తారక్ రాజకీయాల్లోకి దిగితే అంతకంటే ఏం కావాలని తన అభిప్రాయాన్ని తెలిపాడు. తారక్ రాజ‌కీయాల్లోకి రావ‌ల‌ని నేను కూడా కోరుకుంటున్నాన‌ని తెలిపాడు మ‌నోజ్‌. తారక్ ప్రాణనానికి నా ప్రాణం అడ్డు అని వివరణ ఇచ్చాడు. అత‌నితోనే ఉంటాన‌ని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పాడు. నా మిత్రుడి రాకకోసం ఎదురుచూస్తున్నాం. తారక్ ప్రాణనానికి నా ప్రాణం అడ్డు అని వివరణ ఇచ్చాడు. మ‌నోజ్ ట్విట్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -