Monday, May 6, 2024
- Advertisement -

లక్కున్నోడు రివ్యూ

- Advertisement -
Manchu Vishnu’s Luckunnodu Movie Review

మంచు విష్ణు,  హన్సిక  హీరో  హీరోయిన్లుగా రాజ్‌ కిరణ్‌ దర్శకత్వంలో వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన సినిమా లక్కున్నోడు. రాజేంద్రప్రసాద్‌, జయప్రకాష్‌,  పోసాని,  తనికెళ్లభరణి ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమాకు ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు.  ఈడోరకం ఆడోరకం సినిమాతో హిట్ ను అందుకున్న విష్ణు అదే రేంజ్ హిట్ కొట్టాలని తనకు బాగా అచ్చొచ్చిన హీరోయిన్ హన్సికనే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు.  

కధలోకి వెళ్తే..

ఈ సినిమాలో విష్ణు.. లక్కీగా, హన్సిక.. పద్మావతిగా నటించారు.

లక్కీ  పేరులో ఉన్న అదృష్టం అతని జీవితంలో ఉండదు. కొడుకు దురదృష్టవంతుడని  నమ్మిన  తండ్రి, కొడుకిని లక్కీ అని పిలవడం కూడా మానేస్తాడు. హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేయాలనుకున్న లక్కీ ఓ ఆఫీస్‌ కి  ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ పద్మావతిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.  మరోపక్క లక్కీ  చెల్లెలికి పెళ్లి కుదురుతుంది. పెళ్లికి  ఇవ్వాల్సిన కట్నం డబ్బు ఉన్న బ్యాగ్ ను లక్కీ పెళ్లి కొడుకు తండ్రికి ఇస్తాడు.  అయితే పెళ్లి కొడుకు తండ్రికి మతిమరుపు ఉండడంతో డబ్బు ఇవ్వలేదని చెబుతాడు. దీంతో తండ్రి కోప్పడడం, పద్మావతి వదిలివెళ్లిపోడంతో లక్కీ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో  లక్కీ దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి ఒక బ్యాగ్ ఇచ్చి, ఆ బ్యాగ్ ఒకరోజు తన దగ్గర పెట్టుకుంటే కోటి రూపాయలు ఇస్తానని చెబుతాడు. ఇంతకీ ఆ బ్యాగులో ఏముంది? దురదృష్టవంతుడు లక్కున్నోడుగా ఎలా మారాడు..?  అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

 కధనం ఏంటంటే…

పరాయి సొమ్ముకి ఆశ పడని హీరో దగ్గరకు అనుకోకుండా పాతిక కోట్లు వస్తే ఏం చేశాడనేది సినిమా. 

ఇక ఎవరు ఎలా చేశారో విందాం:

 

 విష్ణు కామెడీ టైమింగ్‌ బాగుంది. కొన్ని కొన్ని సన్నివేశాల్లో  మోహన్‌ బాబును ఇమిటేట్‌ చేశాడని భావించక తప్పదు. ఇక హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్ కి  మాత్రమే పరిమితమయ్యింది. వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్‌ల కామెడీ పండింది. విలన్ పాత్రలో ఎం.వి.వి.సత్యనారాయణ ఫర్వాలేదనిపించారు. టెక్నికల్ వ్యాల్యూస్ మాత్రం యావరేజ్ అనే చెప్పాలి.  కామెడీ,  ఇంటర్వెల్ బ్యాంగ్,  ఫ్యామిలీ సెంటిమెంట్  సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా  కధ, కధనం, పాటలు మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా  లక్కున్నోడికి లక్ తిరగలేదన్న టాక్ వినిపిస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -