Tuesday, May 6, 2025
- Advertisement -

శ్రీరెడ్డిపై నిషేధాన్ని ఎత్తేసిన ‘మా’

- Advertisement -

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ విపరీతంగా ఉందని, అలాగే తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదని కొన్ని రోజులుగా నటి శ్రీరెడ్డి నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.ఇది జాతీయ స్థాయిలో సంచ‌ల‌నంగా మార‌డంతో సెంట్ర‌ల్ హెచ్ఆర్సీకూడా శ్రీరెడ్డి వివాదంపై వివ‌ర‌న ఇవ్వాల‌ని నోటీసులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వానికి నోటీసులు ఇచ్చింది.

ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై ఫిల్మ‌చాంబ‌ర్ ముందు శ్రీరెడ్డి ఆర్థ‌న‌గ్న‌ప్ర‌ద‌ర్శ‌న‌చేయ‌డంతో ఆమెప‌పై మా నిషేధం విధించింది. ఆమె పోరాటానికి ఊహించని విధంగా అన్ని వ‌ర్గాల‌నుంచి మద్దతు వస్తుండడంతో ‘మా’ వెనక్కి తగ్గింది. ఏర్పాటు చేసి శ్రీరెడ్డిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఆమె చేసిన ఆరోపణలకు మనస్తాపం చెందామని, ఇకపై ఆమెతో కలిసి ఇతర నటులు నటించవచ్చని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా ప్రకటించారు.

ఆమెపై వేసిన నిషేధాన్ని ఎత్తేయాలని కొందరు ఆర్టిస్టులు కోరడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అంతేగాక టాలీవుడ్ లో నటీమణులపై వేధింపులు అరికట్టడమే లక్ష్యంగా ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -