Saturday, April 20, 2024
- Advertisement -

పోలీసులు అలాంటి వాళ్లే అంటూ హాట్ ఇష్యూపై శ్రీరెడ్డి షాకింగ్ రియాక్షన్!

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో సినీ తారల పై కాస్టింగ్ కౌచ్ అంటూ సినిమా పెద్దల పై తీవ్రస్థాయిలో మండిపడి నడిరోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సమాజంలో జరిగే ప్రతి విషయంలోనూ కలుగజేసుకుని తీవ్ర స్థాయిలో రెచ్చిపోతుంటారు.కేవలం సినిమా ఇండస్ట్రీ అని మాత్రమే కాకుండా సమాజంలో అన్ని వర్గాల వారి పై తనదైన శైలిలో స్పందించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన శ్రీ రెడ్డి తాజాగా రాజకీయాలలో కూడా ఎంటర్ అయి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేస్తూ తీవ్ర వివాదాలను సృష్టిస్తున్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖలో జరిగిన ఓ ఘటన పై శ్రీ రెడ్డి స్పందించారు. ఈ ఘటనలో ఆమె పోలీసులకు సపోర్ట్ చేస్తూ మాట్లాడటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమాజంలో పోలీస్ అంటేనే లంచం తీసుకునేవాడని అపోహ ప్రజల అందరిలోను ఉందని ప్రతి పోలీసు అలాంటి వాడే అనుకుంటారు అంటూ పోలీసులను సపోర్ట్ చేస్తూ మాట్లాడింది.

Also read:రూమర్లకు ఒక్క ప్రోమోతో చెక్ పెట్టిన.. ఎవరు మీలో కోటీశ్వరుడు?

ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎటువంటి వాహనాలు బయట కనపడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా బయట వాహనాలు జరిగితే నిర్మొహమాటంగా చలానాలు విధిస్తున్నారు.ఈ క్రమంలోనే అపోలో ఆస్పత్రిలో పని చేస్తున్నటువంటి ఓ యువతి తనకు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు తనకి చలానా విధించారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు పోలీసుల తీరును తప్పుబడుతున్నారు.

Also read:మళ్లీ పెళ్లికి సిద్ధమైన బిగ్ బాస్ నోయల్..?

తాజాగా ఈ విషయంలో స్పందించిన శ్రీరెడ్డి పోలీసులు తమ డ్యూటీని వారు ఎంతో సక్రమంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చేయడంలో పోలీసులు పాత్ర కూడా ఎంతో ముఖ్యమని, వారి డ్యూటీ వారు చేశారు కానీ ఆ యువతి మాత్రం డ్యూటీలో ఉన్న పోలీసులపై దుర్భాషలాడటం ఆమె తప్పేనని,ఆ యువతిని తప్పుపడుతూ పోలీసులకు సపోర్ట్ చేయడంతో ఈ విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -