- Advertisement -

మా ఇంటి బంగారం..అప్‌డేట్!

- Advertisement -

స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ (MIB) గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ చిత్ర బృందం ఒక కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత సమంత నుండి రాబోతున్న మొదటి చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఫ్యామిలీ క్రైమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా, తాజాగా తన మ్యూజికల్ అప్‌డేట్‌తో పాటు విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధతను తొలగించింది.

రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30 విడుదల తేదీ నుండి తప్పుకోవడంతో, ఆ గ్యాప్‌లో సమంత సినిమా వచ్చేస్తుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, చిత్ర యూనిట్ ఈ వార్తలను పటాపంచలు చేస్తూ.. సినిమా ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 15, 2026నే విడుదలవుతుందని స్పష్టం చేసింది.

సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని మొదటి పాట ‘తస్సాదియా’ను ఏప్రిల్ 16, 2026న విడుదల చేయబోతున్నారు. ఇది ఒక ఎనర్జిటిక్ ఫ్యామిలీ పార్టీ సాంగ్ అని సమాచారం. ఈ సినిమా ఆడియో హక్కులను ‘థింక్ మ్యూజిక్ ఇండియా’ దక్కించుకుంది. సమంత రూత్ ప్రభు, హిమాంక్ రెడ్డి దువ్వూరు మరియు రాజ్ నిడిమోరు (Tralala Moving Pictures బ్యానర్).

సమంత స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నందినీ రెడ్డి – సమంత కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ఓ బేబీ’ హిట్ కావడంతో, ఈ ‘మా ఇంటి బంగారం’ కూడా అదే స్థాయిలో అలరిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -