- Advertisement -
రెడ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటుడు మాదాల రంగారావు మృతిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.మాదాల రంగారావు మరణవార్త విని చాలా బాధపడ్డా మాదాల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు పవన్.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందిన నటుడు, దర్శకుడు, నిర్మాత మాదాల రంగారావు మృతి చెందారని తెలిసి చాలా బాధపడ్డానని అన్నారు.80లలో మాదాల రంగారావు వామపక్ష, అభ్యుదయ భావాలతో తెరకెక్కించిన చిత్రాలు నాటి సమాజంలోని పరిస్థితులకి అద్దంపట్టాయని అన్నారు. ‘రంగారావు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.