ప్రతి మదిలో నిలోచిపోనున్న ‘మది’ విడుదలకు సిద్ధం !!!

Madi Telugu Movie Ready For Release
Madi Telugu Movie Ready For Release

ప్రగతి పిక్చర్స్ బ్యానర్ పై రామ్ కిషన్ నిర్మిస్తున్న సినిమా మది. ఆర్వి సినిమాస్ సహనిర్మాతలుగా, ఆర్ వి రెడ్డి సమర్పణలో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులని అలరించబోతుంది. శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. నాగ ధనుష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు పివిఆర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

రొమాంటిక్ లవ్ స్టొరీ గా రాబోతున్న “మది” ఈ తరం యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేల ఉంటూ, వినూత్నరీతిలో కథనం సాగుతుంది. కథ-సందర్భానుసారంగా ఈ సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నాయి, రఘు కుంచె, సునీత, రమ్య బెహార, దీపు, సాయి చరణ్, హరిణి ఆలపించడం జరిగింది.

వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించనుందని నిర్మాత రామ్ కిషన్, సహా నిర్మాత శ్రీనివాస్ రామిరెడ్డి తెలిపారు.

నటీనటులు: శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి, రామ్ కిషన్, శ్రీకాంత్ బైరోజ్, స్నేహ మాధురి శర్మ, యోగి కత్రి, శ్రీనివాస్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
నిర్మాతలు: రామ్ కిషన్
సహా నిర్మాత: శ్రీనివాస్ రామిరెడ్డి
కథ-కథనం-మాటలు-దర్శకత్వం: నాగ ధనుష్
కెమెరామెన్: విజయ్ ఠాగూర్
మ్యూజిక్: పివిఆర్.రాజా
ఆర్ట్: విజయ్
ఎడిటర్: ప్రదీప్. జంబిగ
లిరిక్స్: కడలి, పూర్ణ చారి