Friday, May 10, 2024
- Advertisement -

వంశీ బుగ్గపై ముద్దిచ్చిన మహేశ్….సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ బాక్సాఫీసు వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మే 9న విడుద‌ల అయిన ఈసినిమా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది.బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర‌యూనిట్ సంబ‌రాలు చేసుకుంటున్నారు.

టాలీవుడ్ ప్రిన్స్, తనకు ఇంతటి హిట్ ను ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి బుగ్గపై ముద్దివ్వగా, ఆ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇక మహేశ్ తనకు ముద్దు పెడుతుండగా, సెల్ఫీ తీసుకున్న వంశీ, దీనికి “ఇదే నా జీవితంలో బెస్ట్‌ మూమెంట్‌. ఇంతకంటే ఇంకేం అడగగలను” అని క్యాప్షన్‌ పెట్టాడు.

అలాగే.. తన కుమార్తె, మహేష్ బాబు, సితారలతో కలిసి తీసుకున్న ఫొటోను కూడా ట్వీట్ చేశారు. ఈ రెండు ఫొటోల్లో వంశీకి మహేష్ బాబు ముద్దు పెడుతోన్న ఫొటో విశేషంగా ఆకట్టుకుంటోంది. ట్విట్టర్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. 

ఇక ఈ సినిమాలో చూపిన ‘వీకెండ్‌ వ్యవసాయం’ కాన్సెప్ట్‌ ఎంతో మందిని ఆ దిశగా నడిపిస్తుండగా, యువత, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వారాంతంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై, ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మిత్రులతో పంచుకుంటున్నారు.అభిమానులు కూడా మహేష్ ని ఇలా చూడలేదే అంటున్నారు

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో మహేష్ కిస్ చేస్తున్న ఫోటో తెగ వైరల్ అయిపోయింది. తనకు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన గుణశేఖర్ పూరి జగన్నాధ్ కొరటాల శివలకు కానుకలు కాంప్లిమెంట్స్ ఇచ్చాడు కానీ ఇలా ముద్దులు పెట్టిన దాఖలాలు మాత్రం లేవు. ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు.అమ్మాయిలే మహేష్ ముద్దు అపురూపం అని ఫీలయ్యే ట్రెండ్ లో ఇలా ఏకంగా వంశీ పైడిపల్లి కిస్ అందుకోవడం విశేషమేగా. ఇలాంటివి చూస్తేనే మహేష్ ఎగ్జైట్ మెంట్ ఏ రేంజ్ లో ఉందొ అర్థమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -