Sunday, May 5, 2024
- Advertisement -

గెట్ రెడీ ఫ‌ర్ సెకండ్ గెట‌ప్‌

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా మ‌హ‌ర్షిలో బిజీగా ఉన్నాడు.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు -అశ్వినీద‌త్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా తాజా షెడ్యూల్ రేపు లేదా ఎల్లుండి నుంచి అమెరికా లో స్టార్ట్ అవుతుంది. సినిమాకు అతి ముఖ్యమైన ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులు సాగుతుందట. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇండియాలో షూటింగ్ కొనసాగిస్తారట. అయితే మ‌హేశ్ ఓ స్పెష‌ల్ లుక్‌లో క‌నిపిస్తార‌ని స‌మ‌చారం.

అదేంటీ మ‌హేశ్ ఇప్ప‌టికే బియర్డ్ లుక్ లో కనిపించాడుగా.. ఇప్పుడు మాత్రం గడ్డం లేకుండా మరో కొత్త లుక్ లో కనిపిస్తాడట. మొదటి లుక్ తో ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసినట్టే ఈ లుక్ కూడా ప్రేక్షకులకు నచ్చేలా మహేష్- వంశీ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.సినిమాను వ‌చ్చే వేస‌వికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -