సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ కు అంత సిధ్ధం అయింది. ఇందులో భాగంగా మహేష్ బాబు ఎన్నడు లేని విధంగా మీడియాతో బాగా ఇంటరాక్ట్ అవుతూ చాలా విషయాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే తనదైన రీతిలో బ్రహ్మోత్సవం చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ హైప్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు మహేష్.
అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రి లో అందరికన్నా బెస్ట్ డ్యాన్సర్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ ని అకాశానికేత్తేశాడు మన సూపర్ స్టార్. అలాగే హీరోయిన్ లలలో కాజల్ సమంత లు అంటే ఇష్టం అని కూడా చెప్పుకొచ్చాడు.
అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత లు హీరోయిన్ లుగా నటించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు గోపి సుందర్ నేపధ్య సంగీతం సమకుర్స్తున్నాడు. పి వి పి సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని మే 20న భారీ ఎత్తున్న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.