Tuesday, April 30, 2024
- Advertisement -

‘రెడ్డి గారి అబ్బాయి’ గా మహేష్ బాబు

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే వంశీ పైడపల్లి దర్శకత్వం లో మహర్షి అనే సినిమా తో అభిమానులందరిని గర్వంగా తల ఎత్తుకునే లా చేశాడు. అంతే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కాలర్ ఎగరేస్కొని తను విజయం సాధించిన విషయాన్ని కూడా మహేష్ బాబు పదే పదే చెప్తూ ఉండడం అభిమానులకి ఎంతగానో సంతృప్తి కలిగించే విషయం.

ఇది ఇలా పోతే త్వరలో మహేష్ బాబు తన తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వం లో చేయనున్నాడు. ఈ విషయం అందర్కి తెలిసినప్పటికీ ఇప్పటికే ఈ విషయం గురించి చాలా టైటిల్స్ మీడియా లో తిరుగుతున్నాయి. తాజాగా రెడ్డి గారి అబ్బాయి ఈ సినిమా కి టైటిల్ అని చెప్పి కొత్త రూమర్ సోషియల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. దీని పై ఇప్పటివరకు అధికార క్లారిటీ లేనప్పటికీ అనిల్ రావిపూడి జూన్ లో ఇదే విషయం మీద క్లారిటీ ఇవ్వనున్నాడు అని తెలుస్తుంది.

దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో మహేష్ బాబు అజయ్ జోసెఫ్ అనే పాత్ర ని చేయనున్నాడు అని టాక్. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకరుస్తున్నాడు. జూలై మొదటి వారం లో ఈ సినిమా షూటింగ్ అధికారికం గా మొదలుకానుంనది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -