మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అను నేను సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల దుమ్ము లేపుతుంది. సినిమా విడుదలైనా రెండు రోజుల్లోనే 100 కోట్ల మార్కెట్‌ను దాటింది.గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో స్టడీగా కలెక్షన్లను సాధిస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా రూ.130 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాల ప్రాథమిక సమాచారం.
అమెరికాలో ఇప్పటికే 3 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా నాన్ బహుబలిగా రికార్డు సృష్టించింది.ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నాలుగు రోజులకే రూ 42.03 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాలో సీఎంగా మహేష్ నటించారు.కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.
‘ భరత్ అనే నేను ‘ 4 డేస్ కలెక్షన్స్
నైజాం – 11.65
సీడెడ్ – 6.15
నెల్లూరు – 1.59
కృష్ణా – 3.42
గుంటూరు – 6.03
వైజాగ్ – 5.69
ఈస్ట్ – 4.80
వెస్ట్ – 2.88
———————————–
ఏపీ+తెలంగాణ = 42.03 కోట్లు