Thursday, May 8, 2025
- Advertisement -

భ‌ర‌తుడి రికార్డుల మోత…. మ‌హేష్ స్టామినా ఇది

- Advertisement -

మ‌హేష్ తాజా చిత్రం భర‌త్ అను నేను సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది.గ‌త శుక్ర‌వారం రీలిజ్ అయిన ఈ సినిమా కేవ‌లం రెండు రోజుల్లోనే 100 కోట్ల మార్క్‌ను అందుకుంది. యంగ్ సీఎంగా మ‌హేష్ న‌ట‌న‌కు అభిమాన‌లు ఫిదా అవుతున్నారు.విడుద‌ల రోజు నుండే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో క‌లెక్ష‌న్లు బాగా పెరిగాయి.తొలి వారాంతంలో మహేశ్ బాబు సినిమా రూ. 120 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఆదివారం కూడా చాలా చోట్ల హోస్‌ఫుల్ క‌నిపించ‌డంతో మ‌రో ప‌ది రోజుల పాటు మ‌హేష్ సినిమాకు తిరుగు లేద‌ని చెప్పాలి.శనివారం నాటికే ఈ చిత్రం అమెరికాలో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసి రంగస్థలం రికార్డులను బ్రేక్ చేసింది.

బాహుబలి చిత్రాల తర్వాత వేగంగా యూఎస్‌లో ఆ మార్క్‌ను చేరుకున్న చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఆస్ట్రేలియాలోనూ ‘భరత్’ సత్తా చాటాడు. 2018లో భారీగా వీకెండ్ ఓపెనింగ్స్ సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో మహేశ్ మూవీ రెండో స్థానంలో నిలిచింది. మొద‌టి స్థానంలో పద్మావత్ సినిమా ఉంది.ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలైంది. కానీ భరత్ మాత్రం తెలుగులోనే విడుదలైంది.ఈ విష‌య‌న్ని ట్రెడ్ అన‌లిస్ట్ త‌రుణ్ ఆద‌ర్శ్ త‌న ట్వీట్ట‌ర్ ద్వారా తెలిపారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -