సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గత రాత్రి(బుధవారం) నెక్లెస్ ప్లాజాలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కు విక్టరీ వెంకటేశ్‌తో పాటు , టాలీవుడ్ సన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా గెస్ట్‌లుగా హాజరైయ్యారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. హీరోయిన్ పూజా హెగ్డెకు మహేశ్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
పూజా హెగ్డె సినిమా గురించి మాట్లాడుతు మహేశ్ బాబులో మంచి నటుడే కాదు, దర్శకుడు కూడా దాగి ఉన్నాడని తెలిపింది. షూటింగ్ చేస్తున్న సమయంలో నేను ఇది గమనించానని చెప్పుకొచ్చింది పూజా హెగ్డె. మహేశ్ బాబు మాట్లాడే సమయంలో పూజా హెగ్డె చేసిన కామెంట్స్‌పై స్పందించాడు. నేను కేవలం యాక్టర్‌ని మాత్రమే అని తెలిపాడు. ఇక్కడ ఎవరు పని వారు చేస్తేనే బాగుంటుందని, అలా కాకుండా అన్ని విషయాల్లో వేళ్లు పెట్టకూడదని చెప్పుకొచ్చాడు.
దీంతో స్టేజీ మీద ఉన్నవారంత ఒక్కసారిగా నవ్వారు. పూజా హెగ్డె కూడా మహేశ్ మాటలకు ముసి ముసి నవ్వులు నవ్వింది. అంటే కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలని మహేశ్ చెప్పకనే చెప్పాడని సోషల్ మీడియాలో దీనిపై మాటలు వినిపిస్తున్నాయి. మహేశ్ తన మాటలతో తానను దర్శకుడిగా చేసే అవకాశం లేదని చెప్పేశాడు.
- Advertisement -
పూజా హెగ్డెకు కౌంటర్ ఇచ్చిన మహేశ్ బాబు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -