Saturday, May 10, 2025
- Advertisement -

స‌మంత‌ని ట్రోల్ చేస్తున్న మ‌హేశ్ ఫ్యాన్స్‌

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ఫాన్స్ హీరోయిన్ స‌మంతని టార్గెట్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు.మహేష్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ విడుదలైనప్పుడు సమంత ట్విట్టర్ వేదికగా ఆ పోస్టర్ పై అసహనం వ్యక్తం చేసింది. అందులో మహేష్ బాబు నడుస్తూ వెళ్తుంటే ఆయన పాదాలు అచ్చులను చేతితో పట్టుకుంటూ హీరోయిన్ ఉండే పోస్టర్ పై సమంత చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులకి ఆగ్రహాన్ని తెప్పించాయి.ఇప్పటికీ ఆ విషయాన్ని వారు మర్చిపోలేదని తాజా విష‌యం ద్వారా తెలుస్తుంది.స‌మంత భ‌ర్త హీరో నాగ‌చైత‌న్య న‌టించిన  ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

తాజాగా ఈ సినిమాలో ఒక పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటలో హీరోయిన్ అను ఇమ్మానుయేల్ చైతు పాదాల దగ్గర ముద్దు పెట్టుకొనే షాట్ ఒకటి ఉంది.తన మొహాన్ని మొత్తం చైతు పాదాల మీద పెట్టి తన్మయత్వం చెందే సీన్ ఒకటి ఈ పాటలో దర్శనమిచ్చింది. వీటిని తీసుకొని ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ సమంతని ప్రశ్నిస్తున్నారు. ఆరోజు మహేష్ సినిమా పోస్టర్ చూసే అంతగా రియాక్ట్ అయిన సమంత ఈరోజు చైతూ అంతకన్నా ఎక్కువగా అనుతో చేయించుకోవడానని ఏమనాలో చెప్పాలంటూ సమంతని నిలదీస్తున్నారు. మ‌రి దీనిపై స‌మంత ఎలా స్పందిస్తుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -