టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా టీజర్ డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. మహర్షి టీజర్‌ను ఉగాది పండుగ సందర్భంగా రేపు (శనివారం) విడుదల చేయనున్నారు. శనివారం ఉదయం 9 గంటల 09 నిమిషాలకు ‘మహర్షి’ టీజర్ ని రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఉగాది పండుగ పోస్టర్‌ను విడుదల చేశారు. మహేష్ బాబు ఈ పోస్టర్ లో బ్లూ కలర్ సూట్ వేసుకొని, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
కార్పోరేట్ స్టైల్ బిజినెస్ మెన్ గా మహేష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పూజా హెగ్డె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.అల్లరి నరేష్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.అశ్వనీదత్, పివిపి, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహర్షి సినిమా మహేశ్ బాబు కెరీర్‌లో 25వ సినిమా కావడంతో సినిమాను చాలా ప్రతీష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్ ఫస్ట్ టైమ్ గెడ్డం, మీసాం పెంచాడు. ఇక సినిమానే మే నెల 9న విడుదల చేయనున్నారు.
- Advertisement -
స్టైలిష్ లుక్‌తో పిచ్చేక్కిస్తున్న మహేశ్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -