Thursday, May 2, 2024
- Advertisement -

జ‌వాన్‌గా మారిన మ‌హేశ్ బాబు

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు జవాన్‌గా మార‌బోతున్నారు. మ‌హేశ్ ఏంటీ జ‌వాన్‌గా మార‌డం ఏంటీ అనుకుంటున్నారా? అస‌లే ఇండియాకు, పాకిస్థాన్‌కు మ‌ధ్య యుద్ద వాత‌వార‌ణం జ‌రుగుతుంది, ఇప్పుడు మ‌హేశ్ జ‌వాన్‌గా మారి యుద్దం చేస్తాడ‌ని అనుమానిస్తున్నారా..? అదేం లేదండి ..మ‌హేశ్ బాబు జ‌వాన్ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అడ‌వి శేష్ హీరోగా న‌టిస్తున్నాడు. కొద్ది రోజులు క్రితం మ‌హేశ్ బాబు , అడ‌వి శేష్‌తో ఓ సినిమా తీయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ వార్త‌ల‌ను నిజం చేస్తు సినిమాను అనౌన్స్ చేశాడు మ‌హేశ్‌. సినిమా టైటిల్‌ను జ‌వాన్‌ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను కూడా విడుద‌ల చేశారు. మ‌హేశ్ బాబుతో క‌లిసి సోని పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మించ‌నున్నారు.తెలుగు, తమిళభాష‌ల‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సాయి కిరణ్ టిక్కా దర్శకత్వం వహిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -