Saturday, May 18, 2024
- Advertisement -

బయట దర్శకులని పట్టించుకోని మహేష్ బాబు

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్ర లో తయారు కానున్న చిత్రం సరిలేరు నీకెవరు. అనిల్ రావిపూడి ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యాక మహేష్ బాబు ఏం సినిమా చేస్తారు అనే విషయం మీద ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదు. కానీ మహేష్ బాబు తో చేతులు కలపడానికి చాలా మంది దర్శకులు ముందుకు వస్తున్నారు కానీ ఎందుకో ఏమో కానీ మహేష్ బాబు మాత్రం సుముఖత చూపించడం లేదు. కొత్త వాళ్ళ తో, పర భాషా దర్శకుల తో పని చేయడానికి మహెష్ కి ఎంత మాత్రము ఇంట్రెస్ట్ లేనట్టే అనిపిస్తుంది.

కన్నడ లో కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమా ని దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఆ సినిమా తర్వాత మహేష్ బాబు తో పని చేయాలనిఒక కథ ని కూడా సిద్ధం చేశారట. మహేష్ ని అప్రోచ్ అయినప్పటికీ మహేష్ మాత్రమై నిర్ణయం చెప్పకుండా అలా ఉండటం తో ఈ దర్శకుడు వెంటనే ఎన్టీఆర్ ని అప్రోచ్ కాగా ఎన్టీఆర్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారట.ఇక ప్రశాంత్ మహేష్ తో సినిమా చేయాలనే ఆప్షన్ ని తీసేసారని తెలుస్తుంది. ఇంకా బాలీవుడ్ నుండి తమిళం నుండి కూడా దర్శకులు మహేష్ తో పనిచేయాలని అనుకుంటున్నారు కానీ మహేష్ మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -