టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ముగ్గురు నిర్మాతలు కలిసి ఈ సినిమాను ఎంతో ప్రతీష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్ ఫస్ట్ టైమ్ ఫుల్ గెడ్డం , మీసాంతో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ బిట్,పోస్టర్స్‌కు మంచి స్పందన వచ్చింది.ఇటీవలే హీరోయిన్ పూజా హెగ్డె ఫోటోను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్.
తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగానే డబ్బింగ్ స్టార్ట్ చేశాడు వంశీ పైడిపల్లి. తాజాగా దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు దిల్ రాజు. ఇక ఈ సినిమాలో మహేశ్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. అల్లరి నరేశ్ ఈ సినిమాలో మహేశ్ ఫ్రెండ్‌గా కనిపించనున్నాడు. ఇక సినిమా వచ్చే ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!