Thursday, May 8, 2025
- Advertisement -

మహేశ్ బాబు.. డబుల్ యాక్షన్ సినిమా…!

- Advertisement -

ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ప్రిన్స్ మహేశ్ బాబు. ఈ హీరో కెరీర్ లో ఇప్పటి వరకూ చాలా ప్రయోగాలే చేశాడు. మరి ఇప్పుడు అలాంటిదే మరో ప్రయోగం చేయబోతున్నాడు. అది కూడా డబుల్ యాక్షన్ చేయడానికి సిద్దమై ఇప్పుడు మహేశ్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు.

మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందబోతోందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేశ్ డబుల్ యాక్షన్ చేయబోతున్నాడని తెలుస్తోంది.తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమాలో మహేశ్ ఈవిధంగా సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. దర్శకుడు ఏఈఆర్ మురగదాస్ కు హీరోలను డబుల్ పోజులో చూపడంలో ప్రత్యేకత ఉంది. ఇది వరకూ ఆ దర్శకుడు రూపొందించిన ‘కత్తి’ సినిమాలో విజయ్ డబుల్ యాక్షన్ చేశాడు. మరి ఇప్పుడు మహేశ్ తో కూడా దర్శకుడు అలాంటి మ్యాజిక్ నే చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.

మరి తెరపై ఒక పాత్రలో కనిపిస్తేనే మహేశ్ అభిమానులకు కనువిందైన ఆనందాన్ని అందించాడు. అలాంటిది ఏకంగా డబుల్ యాక్షన్ అంటే.. ప్రిన్స్ ఫ్యాన్స్ కు అంతకు మించిన ఆనందం లేదేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -