టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత చాలా సైలెంట్‌గా ఉంటారు.తన ఫ్యామిలీ తప్ప పెద్దగా ఎవరిని పట్టించుకోదు.మరి అలాంటి నమ్రతకు ఓ ఫుడ్ డెలివెరీ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పూర్తి వివరాల్లో వెళ్తే…జొమాటో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలలో ఇది కూడా ఒకటి. జొమాటో డెలివెరీ బాయ్ ఒకరు కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాకెట్స్ ని ఓపెన్ చేసి కొంచెం కొంచెం తిని, తిరిగి ప్యాక్ చేసి డెలివెరీ చేశాడు. ఈ నిర్వహం మొత్తం కెమెరాలో బంధించారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియోపై చూసిన నమత్ర తన కోపాన్ని ఆపులేక ట్వీట్టర్ ద్వారా ఈ వీడియోని షేర్ చేసి ఆ సంస్థని కడిగిపారేసింది.
”ఇంత పేరున్న ఫుడ్ డెలివెరీ సంస్థ పనితీరు చూస్తుంటే షాకింగ్ గా ఉంది. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్లు కనీస శుభ్రతని ఆశిస్తారు.కానీ ఈ విధంగానా డెలివర్ చేసేది..? మీకు వర్క్ ఎథిక్స్ అనేవే లేవా..? ఇదంతా చూస్తుంటే ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. నా పిల్లలను మాత్రం ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయనివ్వను. అందరికీ కూడా నా సజెషన్ ఇదే..” అంటూ తన ట్వీట్టర్‌లో పోస్ట్ చేసింది నమ్రత.మరి ఎవరికి అయిన ఇలానే ఉంటుంది కదా.సంఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్న దీనిపై జొమాటో సంస్థ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తుంది.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ