భరత్ అనే నేను’.. హామీ ఇస్తున్నానూ అంటూ ఈనెల 20 న థియేటర్స్‌లో బిగ్ రిలీజ్‌కు రెడీ అయ్యారు మహేష్ బాబు. కొరటాల శివ, మహేష్ కాంబినేషన్‌లో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచానాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో మొత్తం 2000 ప్రీమియర్ షోలను అమెరికాలో ఫిబ్రవరి 19న (గురువారం) ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా బాక్సాఫీసు వద్ద సినిమా సునామీ సృష్టించబోతోందని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు.
ఈ మేరకు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మహేశ్‌బాబు సినిమా ప్రీమియర్ స్క్రీనింగ్స్‌లో మైండ్‌బ్లోయింగ్ వసూళ్లు సాధించేలా ఉందని పేర్కొన్నారు. సినిమా కొత్త రికార్డు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అమెరికాలో మొత్తం 320కిపైగా లొకేషన్లలో సినిమాను ప్రదర్శించనున్నారట. ఫస్ట్ వీకెండ్ కి మొత్తం 10 వేల షోలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ తర్వాత అమెరికాలో భారీ వసూళ్లు సాధించిన సినిమాల రికార్డును ‘భరత్’ బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మాత దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ జోడీ కడుతోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, బ్రహ్మాజీ తదితరులు ఈ మూవీలో ముఖ్యపాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించారు. ఈ సినిమా మరో హిట్ కాయం అనే టాక్ వినిపిస్తోంది.