- Advertisement -
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వంశీ పైడిపల్లి పుట్టిన రోజు ఈ రోజు.ఈ సందర్భంగా ఆయనకు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తన దర్శకుడికి పుట్టిన రోజు విషెస్ వెరైటీగా చెప్పాడు మహేశ్.‘40 ఏళ్ల యంగ్ దర్శకుడు, నా స్నేహితుడు వంశీ పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
40 ఏళ్లంటే 20 ఏళ్లే, యంగ్‌గా, ఆనందంగా జీవించండి’ అని మహేశ్ ట్వీట్ చేశారు. అతనితో సెట్‌లో ఉన్న ఫోటోని మహేశ్ ట్వీట్ చేశాడు.ఇక మహేశ్ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.వచ్చే ఏప్రిల్‌లో విడుదల చేయాటానికి సన్నాహాలు చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=4nAQQyYJgvg