Saturday, May 25, 2024
- Advertisement -

మహేశ్ బాబు .. ఆ భాషలో సత్తా చాటుతాడా!

- Advertisement -

ప్రిన్స్ మహేశ్ బాబుకు హిందీలో కూడా క్రేజ్ ఉన్న విషయం విదితమే. మహేశ్ బాబు చేయబోయే, చేస్తున్న సినిమాల గురించి బాలీవుడ్ హీరోలు కూడా ఆసక్తిగా సమాచారాన్ని తెలుసుకొంటూ ఉంటారు. ఇతడి సినిమాలను రీమేక్  చేయడం లేదా డబ్ చేయడం పట్ల వారిలో ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఎండార్స్ మెంట్స్ ద్వారా కూడా మహేశ్ హిందీ వాళ్లకు పరిచయస్తుడే. హిందీలో మాత్రమే కాదు.. ఇప్పుడు మహేశ్ మరో భాషలో సత్తా చాటుకొనున్నాడు…. ఈ సారి ఆయన తమిళ ప్రేక్షకులను పలకరించనున్నాడు.

ఇది వరకూ ‘అతడు’ వంటి సినిమాలు తమిళంలోకి డబ్ అయ్యాయి. ఇప్పుడు “బ్రహ్మోత్సవం” సినిమాతో మహేశ్ బాబు తమిళ ప్రేక్షకులను పకలరించనున్నాడు. ఈసినిమాను తమిళంలో కూడా ఒకేసారి రూపొందిస్తున్నారు. ఈ సినిమాను తమిళం వైపు తీసుకెళ్లడం వెనుక ప్రత్యేక ఆసక్తి నిర్మాతలదేనని తెలుస్తోంది. పీవీపీ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ సంస్థకు తమిళంలో కూడా ఇది వరకూ సినిమాలు రూపొందించిన అనుభవం ఉంది.

ఇలాంటి నేపథ్యంలో మహేశ్ బాబు సినిమాను కూడా వీరు  తమిళంలోకి తీసుకెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. దీన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల చేసి.. ప్రిన్స్ కు అక్కడ ఉన్న ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకెనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇది మహేశ్ కు ఎలాంటి అనుభావాన్ని ఇస్తుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -