అక్కినేని నాగ చైతన్య హీరోగా సమంత హీరోయిన్‌గా నటించిన చిత్రం మజిలీ. నిజ జీవితంలో భార్య భర్తలు అయిన వీరిద్దరు , సినిమాలో కూడా భార్య భర్తలుగానే నటించడం విశేషం. పైగా పెళ్లి తరువాత వీరిద్దరు కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొత్తదనం లేని కథలలో బరువైన ఎమోషన్స్‌ని కలం బలంతో నిలబెడుతున్న తీరు ఫ్యామిలి ఆడియెన్స్‌ని దగ్గర చేస్తుంది ఈ సినిమా. సినిమాలోని ఎమోషన్‌కు అందకు ఈజీగా కనెక్ట్ అవుతారు.
సినిమా చూస్తున్నంతసేపు ఈ సీన్ నా జీవితంలో జరిగింది కదా అనుకోవడం వల్ల , సినిమా అందరికి రీచ్ అవుతోంది. నాగచైతన్య, సమంతలు తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. థియోటర్లలో పెద్దగా సినిమాలు ఏమి లేకపోవడం, వరుస సెలవలు కావడం మజిలీకి కలిసి వచ్చే అంశం. ప్రస్తుతానికి అయితే సినిమా ఏ రేంజ్ హిట్ చెప్పడం కొంచెం కష్టమే. ఇక చాలాకాలం తరువాత నాగచైతన్య కెరీర్‌లో మరో హిట్ వచ్చింది.
- Advertisement -
ఎమోషన్స్‌తో గుండెల్ని పిండేస్తున్న మజిలీ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -