కార్తికేయ-2 డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం తండేల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.
శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన నిజ జీవిత ఘటన ఆధారంగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది తండేల్.
తండేల్ కు U/A సర్టిఫికెట్ అందించినట్లు తెలుస్తోంది. రన్ టైమ్ 2 గంటల 32 నిమిషాలుగా ఉండగా ఈ సినిమాతో చైతూ కమ్ బ్యాక్ కావడం పక్కా అని తెలుస్తోంది. ఇక సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ప్రశంసలు గుప్పించారని తెలుస్తోంది. లవ్ స్టోరీ మూవీ తర్వాత సాయి పల్లవి, చైతూ ఇద్దరూ జోడిగా వస్తుండటంతో ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
