Wednesday, May 7, 2025
- Advertisement -

మలయాళం, తమిళం , తెలుగు లో బన్నీ నే బాస్

- Advertisement -

టాలీవుడ్ లో తన సత్తా చూపిస్తున్న హీరో బన్నీ కి మలయాళం లో ఎంత మార్కెట్ ఉందొ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అతని కళ్ళు తమిళ్ మీద కూడా పడ్డాయి అంటున్నారు ఫిలిం నగర్ జనాలు.

ఇప్పటికే మహేష్ – రాం చరణ్ లాంటి హీరోలు తమ సినిమాలు తమిళ్ లో కూడా పారలల్ విడుదల చేస్తూ ఉండగా తమిళం లో మార్కెట్ మనకి పరవాలేదు అన్నట్టు సాగుతోంది. రుద్రమ దేవి సినిమాకి మాత్రం మంచి కలక్షన్ లు రాగా బ్రూస్ లీ, శ్రీమంతుడు సినిమాలు అక్కడ పెద్ద ప్లాప్ లు గా మిగిలాయి. స్టైలిష్ స్టార్ ఇప్పుడు తన సత్తా ని కాలక్ష ల రూపం లో అక్కడ చాటాలి అని చూస్తున్నాడు. తన కొత్త సినిమా సరైనోడు (బోయపాటి దర్సకత్వం ) ని అక్కడ విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కుదరకపోయినా దీని తరవాత  తరవాత మనం – ఇష్క్ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు విక్రం కుమార్ తో ఒక సినిమా తీయడానికి సిద్దం అయ్యాడు మనోడు ఆ సినిమా ఎలాగైనా తమిళం లో విడుదల చేసి దాంతో పాటు తెలుగు, తమిళం లలో నిర్మించాలి అని ప్లాన్ చేస్తున్నాడు. ఎటూ మలయాళం లో బన్నీ కి మంచి మార్కెట్ ఉంది కాబట్టి మూడు బాషలలో మంచిగా ఆడితే కలక్షన్ ల వర్షం కురవడం పక్కా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -