బాలీవుడ్‌లో సెక్సీ బాంబ్ అంటే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చే పేరు మల్లికా షెరావత్.గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది మల్లికా.అయితే తాను ఎందుకు ఇండస్ట్రీకి దూరం అవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది.కేవలం కాస్టింగ్ కౌచ్ వల్లనే తను ఇండస్ట్రీకి దూరమైపోయానని చెప్పుకొచ్చింది మల్లికా షెరావత్. తెరపై చూపించిన శృంగారాన్ని తెరవెనక కూడా అందించాలనే డిమాండ్లు ఎక్కువవ్వడంతో పరిశ్రమను వీడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
దాదాపు ప్రతి హీరో తనను అర్థరాత్రిళ్లు ఇంటికి పిలిచేవాడని, దీంతో బాగా అభద్రతా భావానికి లోనయ్యాని చెప్పుకొచ్చింది మల్లిక. కొన్ని నెలల పాటు సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్ లో సినిమాలు తగ్గించేశానని తెలిపింది.పడక సుఖం అందించమని బలవంతం చేసిన వ్యక్తుల్లో దర్శకులు కూడా ఉన్నారంటోంది మల్లిక. ఓ దర్శకుడు అయితే అర్థరాత్రి 3 గంటలకు రమ్మన్నాడని, ఆ తర్వాత మానసికంగా బాగా హింసించాడని కూడా బయటపెట్టింది.