Saturday, May 18, 2024
- Advertisement -

రూమ్‌కి రమ్మన్నారు..వరలక్ష్మీ షాకింగ్!

- Advertisement -

సీనియర్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు వరలక్ష్మీ శరత్ కుమార్. వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలకు ప్రాణం పోశారు వరలక్ష్మీ. ఆమె ఆహార్యం, గంభీరం చూసి ఫిదా అయ్యారు. స్టార్ హీరోలకు ధీటుగా నిలబడి డైలాగులు చెప్పే తీరుకు అందరూ మంత్ర ముగ్ధులయ్యారు.

తాజాగా వరలక్ష్మి నటించిన చిత్రం శబరి. పాన్ ఇండియా సినిమాగా మే 3న విడుదల కానుండగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో వరలక్ష్మీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు వరలక్ష్మీ. స్టార్ హీరో కూతురును అయ్యి కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇండస్ట్రీలో అమ్మాయిలు రాణించడం చాలా కష్టమని,నాన్నకు ఇష్టం లేకపోయినా పరిశ్రమకు రావాల్సి వచ్చిందని తెలిపారు. తమిళనాడుకు చెందిన ఓ టీవీ ఛానెల్ యజామాని తన దగ్గరకు వచ్చాడని, ఒక ప్రాజెక్టు ఉందని, కలిసి పనిచేయాలని కోరాడు. అందుకే నేను ఓకే చెప్పాను. కొంచెంసేపు గడిచిన తర్వాత మనం బయట కలుద్దాం అన్నాడు. నేను ఎందుకు అని అడిగాను. అలా మాట్లాడుకుందాం.. రూమ్ బుక్ చేస్తాను అన్నాడు. ఒక హీరో కూతురు అయిన నన్నే ఇలా అడిగితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని అమ్మాయి పరిస్థితి ఏమిటి? అనిపించిందని షాకింగ్ కామెంట్స్ చేశారు వరలక్ష్మీ. ఈ సంఘటన జరిగిన ఆరు సంవత్సరాలవుతోందని..కమిట్‌మెంట్ అడగకుండా ఉండలేరని, అయితే కొన్నింటిని తాను రిజక్ట్ చేయడంతో ఆ సినిమాల నుండి తనను తీసేసారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -