Saturday, May 4, 2024
- Advertisement -

రవితేజ హీరోయిన్ పై విరుచుకుపడ్డ నెటిజన్లు

- Advertisement -

హాట్ బ్యూటీ మాళవిక శర్మ రవితేజ హీరోగా నటించిన ‘నేలటికెట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమానే ఫ్లాప్ అవడంతో తర్వాత మాళవిక కి పెద్దగా అవకాశాలు రాలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసిన ఒక్క ఫోటో వివాదాస్పదంగా మారడంతో వార్తల్లోకి ఎక్కింది. ఈ మధ్యనే థాయిలాండ్ వెళ్లిన మాళవికా శర్మ అక్కడ పట్టాయా లోని టైగర్ పార్క్ కి వెళ్ళింది. అక్కడ ఒక పులి ని హగ్ చేసుకుంటూ ఫోటో కి పోస్జ్ ఇచ్చిన మాళవిక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మనుషులతో మెలిగేలా ఆ పులిని ట్రైన్ చేశారని, థాయిలాండ్ వెళితే కచ్చితంగా ఆ పార్క్ కి వెళ్దామని, అక్కడ పులి పిల్లలు క్యూట్ గా అల్లరి చేస్తూ ఉంటాయని చెప్పింది మాళవిక. కొంతమంది జంతు ప్రేమికులు మాత్రం ఆమెపై విరుచుకుపడుతున్నారు. “వాటిని ట్రైన్ చేయలేదు. డ్రగ్స్ తో నీరసించేలా చేసి ఈ ఫోటో లకి ఫోజ్ ఇచ్చేలా చేశారు. నువ్వు చేసింది యానిమల్ అబ్యూజ్. అది పూర్తిగా అనైతికం” అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా మరొకరు “అది పులి బొమ్మ కాదు. నిజంగా హగ్ చేసుకోవాలని ఉంటే అలాంటిదే ఒక బొమ్మను కొనుక్కో. అంతేతప్ప ఇలా క్రూరంగా ప్రవర్తించకు” అని మరొకరు కామెంట్ చేశారు. పబ్లిసిటీ కోసం మాళవిక ఇలాంటి పనులు చేస్తుందని కానీ అది ఆమెకి రివర్స్ అయ్యాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -