ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కి సన్నాహాలు మొదలవుతున్నాయి. వై.ఎస్.ఆర్ పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని సంప్రదించిన విషయం అందరికి తెలిసిందే. మమ్ముట్టి కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఒక కండిషన్ చెబుతున్నాడు మమ్ముట్టి.దానికి ఓకే అయితేనే సినిమా చేస్తాను అంటున్నాడు ఈ మళయాళ హీరో. ఆ కండిషన్ ఏంటీ అనుకుంటున్నారా! తన పాత్రకి తనే డబ్బింగ్ చెబుతా అని షరతు పెట్టారట.మరి దీనికి చిత్ర యూనిట్ సరే అంటారో లేదో చూడాలి.
మమ్ముట్టికి తెలుగు బాగానే వచ్చు ఆయన వాయిస్ గంభీరంగా ఈ పాత్రకి సెట్ అవుతుంది. జూన్ లో ఈ సినిమా షూటింగును ప్రారంభించి దసరా కల్లా సినిమా పూర్తి చేయలని చిత్ర బృందం ఆశిస్తుంది.సినిమాకు ఇతర పాత్రలకు నటుల ఎంపిక జరుగుతుంది.వైఎస్ విజయమ్మగా లేడి సూపర్ స్టార్ నయనతార చేస్తుందని సమాచారం.అలాగే వైఎస్ జగన్‌గా తమిళ్ హీరో సూర్య చేస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.దీనిపై చిత్ర యూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.