మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి యంగ్ హీరో అఖిల్ అక్కినేని తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హిపాప్ సంగీతం అందిస్తున్నాడు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది.
ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ ను విడుదల చేస్తూ..క్రమశిక్షణ, అంకితభావంతో తనదైన మార్గాన్ని సుగమం చేసుకున్న మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఏజెంట్ సినిమాలో చేరారు అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు అఖిల్. సిక్స్ ప్యాక్ బాడీతో సందడి చేయనున్నాడు. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్, ఎడిటర్ నవీన్ నూలి వ్యవహారించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.