Wednesday, May 1, 2024
- Advertisement -

అఖిల్ ఏజెంట్ మూవీ ఆ రేంజ్ లో ఉంటుందా ?

- Advertisement -

అఖిల్ అక్కినేని ప్రస్తుతం ” ఏజెంట్ ” అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీలో అఖిల్ ను చాలా కొత్తగా చూపించబోతున్నాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. కండలు తిరిగిన దేహంతో హల్క్ ఆకారంలో ఉన్న అఖిల్ మెకోవర్ ” ఏజెంట్ ” పై విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో అఖిల్ స్రీన్ ప్రజెంట్స్.. అలాగే విజువల్స్ హాలీవుడ్ మూవీని తలపించేలా ఉండడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ మూవీ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మొత్తం ఎనిమిది ఫైట్ సీన్స్ ఉన్నాయట. .

అవికూడా చాలా కొత్తగా హాలీవుడ్ రేంజ్ లో డిజన్ చేశారట డైరెక్టర్ సురేందర్ రెడ్డి. పక్కా యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతున్న ఈ మూవీలో అఖిల్ యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ ఆడియన్స్ ను ఫుల్ గా థ్రిల్ చేస్తుందని చిత్రయూనిట్ కాన్ఫిడెంట్ గా ఉందట. ఇక ఈ మూవీ ఎప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదాలు పడుతూనే వస్తోంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుందని భావించినప్పటికి, భారీ సినిమాలు సంక్రాంతి రేస్ లో ఉండడంతో మూవీ మళ్ళీ వాయిదా పడింది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ‘ ఏజెంట్ ” మూవీని సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి ఇప్పటి సరైన హిట్ లేక స్టార్ ఇమేజ్ కు దూరంగా ఉన్న అఖిల్ అక్కినేని ” ఏజెంట్ ” మూవీతోనైనా సరైన హిట్ కొట్టి స్టార్స్ జాబితాలోకి ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మహేశ్ కథతో విజయ్ ” వారసుడు “..!

పుష్ప 2.. సుక్కు నయా ప్లాన్ ?

రవితేజను లైన్లో పెడుతున్న పూరీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -