దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో.. ఆయన శిష్యుల్లో అగ్రగణ్యుడైన హీరో మోహన్‌బాబు ఫ్యామిలీ దిగ్భ్రాంతికిలోనైంది. గురువు మరణవార్త తెలిసిన వెంటనే కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన మంచు ఫ్యామిలీ.. ఆ తర్వాత దాసరి నివాసం, అంతిమయాత్రలోనూ కీలకంగా వ్యవహరించారు.
{loadmodule mod_custom,Side Ad 1}
అయితే దర్శకరత్న మరణంపై స్పందించాల్సిందిగా పదేపదే అడగడంతో మీడియా ప్రతినిధులకు మంచు లక్ష్మీ ఒక అభ్యర్థన చేశారు. ‘ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో నేను లేను.. దయచేసి మాట్లాడించే ప్రయత్నం చేయకండి..’ అని ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు. ఇది ఇలా ఉంటే తన తమ్ముడు మంచు మనోజ్‌ను దాసరి ఎత్తుకునిఉన్న అరుదైన ఫొటోను మంచు లక్ష్మీ షేర్ చేశారు.
{loadmodule mod_custom,Side Ad 2}
దాసరి ఒక శక్తి అని, అడిగినవారికల్లా కాదనకుండా సహాయం చేసేవారని లక్ష్మీ కామెంట్ పెట్టారు. దాసరి నిజమైన సినీ ప్రేమికుడని, ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటని లక్ష్మీ పేర్కొన్నారు.
{youtube}RGBJtYWuA2M{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related