మంచు మనోజ్ సినిమాలకు కొంత కాలంగా దూరంగా ఉన్నాడు. అయితే అందుకు కారణాలు ఏంటని మాత్రం చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మంచు మనోజ్ సినిమాలకు దూరం కావడం వెనక రకరకల కామెంట్స్ వినిపించాయి. తాజాగా దీనిపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. తన పర్సనల్ లైఫ్ లో.. అలానే ప్రొఫెషన్ కెరీర్ లో జరిగిన కొన్ని విషయాలను ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. ఆయన వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులు జరిగాయి.
తాజాగా ఆయన తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. తన విడాకుల ప్రక్రియ పూర్తాయిందని బరువైన మనసుతో మీకు తెలియజేస్తున్నానంటూ ఓ లేఖ విడుదల చేశాడు మనోజ్. నాలుగేళ్ల తమ అందమైన బంధానికి ముగింపు జరిగిందని.. తమ మధ్య వచ్చిన భేదాభిప్రాయల కారణం చేత.. చాలా నొప్పిని అనుభవించానని తెలియజేశాడు. ఎంతో వేదన తర్వాత విడిపోయేందుకు ఇద్దరం నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
వీడిపోయినప్పటికి ఇద్దరం ఒకర్ని ఒకరం ఎప్పుడు గౌరవించుకుంటూనే ఉంటామని.. తామిద్దరం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంత గౌరవిస్తారని.. అలానే తమ పర్సన లైఫ్ కి ప్రైవసీ ఇస్తారని ఆశిస్తున్నాము అంటూ లేఖ రాశాడు మనోజ్. అలానే తన హృదయం కొన్ని రోజులుగా సరైన స్థానంలో లేదని.. అందుకే సినిమాలపై దృష్టి పెట్టలేకపోతున్నాని చెప్పాడు. ఇలాంటి సమయంలో ఫ్యామిలీ, స్నేహితులు, ముఖ్యంగా ప్రాణానికి ప్రాణమైన ఫ్యాన్స్ తనకు అండగా ఉన్నారని చెప్పాడు.
వాళ్ల సపోర్ట్ నేనెప్పుడు మర్చిపోనని.. వాళ్లు లేకుంటే ఈ రోజు ఈ స్థితికి వచ్చేవాడిని కాదని చెప్పాడు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదలు తెలిపాడు. ఇక మళ్లీ సినిమాల్లో నటిస్తానని.. తన లైఫ్ లో సినిమాలు ప్రాణంగా నిలిచాయని.. చివరి వరకు నటిస్తూనే ఉంటానని మంచు మనోజ్ చెప్పాడు.
