మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీని కలిసి రూ. 1 లక్ష బాండ్ సమర్పించారు మనోజ్. తాను ఎలాంటి గొడవలకు దిగనని…కూర్చొని మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
మా నాన్నను అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారని.. ఆయన దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులుపై దాడి చేసిన మోహన్ బాబు, అన్న మంచు విష్ణు తరపున మంచు మనోజ్ క్షమాపణలు చెప్పారు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదన్నారు. జర్నలిస్టులకు తానేప్పుడు తోడుంటానన్నారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు మనోజ్.
ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయని, తమ ఇంట్లో గొడవను పెద్దదిగా చేసి చూపించవద్దని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని, తన నాన్న మోహన్‌బాబు నమస్కరిస్తూనే మీడియా ముందుకు వచ్చారని గుర్తుచేశారు.