సినిమాలు తప్ప మరో విషయంలో జోక్యం మన హీరోలు. అయితే ఇటీవల కాలంలో మన హీరోలు అన్ని విషయాలపై అవగాహన పెంచుకుని మాట్లాతున్నారు.నిన్న వెలువడిన కర్ణాటక ఎన్నికల ఫలితాలపై హీరో నిఖిల్,రచయిత కోన వెంకట్ స్పందించారు. ఇప్పుడు తాజాగా హీరో మంచు విష్ణు కూడా స్పందించారు.‘వాట్ ఏ ట్విస్ట్ సర్ జీ’.. కర్ణాటక తీర్పు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోంది.
ఇటీవల వచ్చిన ఏ సినిమాలోనూ ఇన్ని మలుపులు, ట్విస్ట్‌లు లేవు. బహుశా.. అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు కర్ణాటకీయాన్ని సిరీస్‌లుగా విడుదల చేయొచ్చేమో. ఇంచుమించు నేను నటిస్తున్న ‘ఓటర్’ చిత్రం కూడా కర్ణాటక ఎలక్షన్స్ మాదిరిగానే ఉంటుందంటూ ట్వీట్ చేశారు మంచు విష్ణు.
And no movie in the recent times had the twists and turns like #Karnatakverdict . One of the best Thriller shows. Maybe Netflix or Amazon should make a series!
— Vishnu Manchu (@iVishnuManchu) May 16, 2018