2008లో పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైన మంచు విష్ణు మరియు విరానికా జంట కి ముగ్గురు పిల్లలు. అందులో కవల పిల్లలు అరియానా, వివియానా మరియు బాబు అవ్రామ్. తాజాగా విరానికా తమ నాలుగవ బిడ్డకు జన్మనివ్వబోతుందని అని తెలిసిన విషయమే. తాజాగా ఈమె శ్రీమంతం చాలా గ్రాండ్గా చేశారు. ఈ నేపథ్యంలో లో కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు మంచు విష్ణు. తన భార్య శ్రీమంతం ఫోటోలను పోస్ట్ చేస్తూ ఒక స్వీట్ మెసేజ్ ని కూడా పోస్ట్ చేశాడు.
“టు ది సూపర్ అమ్మ. ఐ లవ్ యు టు ది మూన్ అండ్ బ్యాక్” అంటూ క్యాప్షన్ తో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు మంచు విష్ణు. ముఖ్యంగా మంచు విష్ణు విరానికా మరియు తమ ముగ్గురు పిల్లలు ఉన్న ఫోటోలు చాలా చూడచక్కగా ఉన్నాయి. మంచు కుటుంబం అప్పుడే సెలబ్రేషన్ లను మొదలు పెట్టేసింది. మరి ఈసారి ఆడపిల్ల లేక మగ పిల్లవాడు పుట్టబోతున్నాడా అనేది ఇంకా వేచి చూడాలి. ఇక సినిమాల పరంగా చూస్తే కొన్నాళ్ల నుంచి వెండితెరకు దూరంగా ఉంటున్న మంచు విష్ణు నటించిన ‘ఓటర్’ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది.