Friday, May 3, 2024
- Advertisement -

రవితేజ రెమ్యునిరేషన్ ఎంత పెంచాడు..?

- Advertisement -

మాస్ మహారాజ్ రవితేజ తన రెమ్యునిరేషన్ ను అమాంతం పెంచేశాడనే మాటలు.. ఛాంబర్ నుంచి ల్యాబ్ వరకు ఎక్కడికి పోయినా వినిపిస్తున్నాయి. ఓ సినిమా హిట్ అయితే హీరోలు రెమ్యునిరేషన్ ను పెంచడం ఆనవాయితీ. అదే రీతిలో ఇపుడు రవితేజ తన రెమ్యునిరేషన్ ను పెంచాడని చెబుతున్నారు. ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే మాస్ రాజాకు నష్టాలు వచ్చినప్పుడు కూడా పారితోషకం తగ్గించుకోండి బాబుగారు అని చెప్పినా వినలేదట. అదే ఇదితోనే ఇపుడు హిట్ వచ్చాక ఇక ఆగుతాడా చెప్పండి. ఒక్కసారిగా ఫిగర్ పెంచేశాడు.

దీంతో రవితేజతో సినిమాలు చేద్దామనుకుంటోన్న నిర్మాతలు పెరిగిన రెమ్యునిరేషన్ చూసి.. సినిమా బడ్జెట్ లెక్కలు వేసుకుని అది మనకు ఎంత వరకు సేలబుల్ అనే విషయాన్ని దృవీకరించుకుని ఈసారి వ్యాపారం మాట్లాడుకోవడానికి వెళ్దామనుకుంటున్నారట. ఎందుకంటే… ఇక్కడ ఉన్న కమిటమెంట్స్ అలాంటివి. అయితే ఇవేమి లెక్కలు వేసుకోకుండా డబ్బులు ఉన్నాయి కదా అని దూకేసేవారు ఈవిషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారట.

ఇంతకీ రవితేజ పారితోషకం ఎంతో చెప్పలేదు కదూ. ఎంతండి జస్ట్ 8 కోట్లేనని తేల్చి చెప్పేశాడు. అవకాశాలు రాకపోతే ఖాళీగా ఉంటానని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ హిట్ కొట్టడంతో, ఆయన తన పారితోషికాన్ని 10 కోట్లు చేసేశాడట. అంత డిమాండ్ చేస్తే అవకాశాలు తగ్గుతాయని చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదట. ‘నేను రోజుకు వెయ్యి రూపాయలకి పనిచేసినప్పుడు ఎవరూ మాట్లాడలేదు .. అలాంటి వాళ్లు ఇప్పుడు సలహాలు ఇవ్వడం బాగోలేదు అంటూ ముఖానే చెప్పేస్తున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -