- Advertisement -

‘మత్తు వదలరా’ రివ్యూ

- Advertisement -

కథ : బాబు మోహన్ (శ్రీ సింహా) ఊరు నుంచి వచ్చి మాములు జీతంతో డెలవరీ బాయ్ గా ఉంటాడు. అతని ఫ్రెండ్స్ తో ఒక రూమ్ లో ఉంటూ డబ్బులు కోసం ఇబ్బంది పడుతుంటాడు. స్నేహితుడు ఏసు (సత్య) వల్ల చాలా తెలివిగా డెలివరీ ఇస్తూ తన వినియోగదారులను మోసి చేసి డబ్బు సంపాధించాలని నిర్ణయించుకుంటాడు. ఈ నేపథ్యంలో ఒక ఫ్లాట్‌కు వెళ్తాడు. కానీ అక్కడ కొన్ని సంఘటనలతో ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. మరి ఆ కేసు నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది కథ. ఇంతకు బాబు మోహన్ క్రైమ్ లో ఎలా ఇరుక్కున్నాడు ? అతను తిరిగి ఆ కేసు నుంచి బయటకు ఎలా వచ్చాడు ? ఈ మధ్యలో అతను ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు ? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : హీరో, పాటలు, కామెడీ ఇలా దర్శకుడు రాసుకున్న విధానంగా బాగుంది. ఫస్ట్ మూవీ అయినా దర్శకుడు రితేష్ తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. వాస్తవికతకు కాస్త దూరంగా అనిపించినా ఆయన స్క్రీన్ ప్లే మాత్రం ప్రేక్షకుడికి ఉత్కంఠను కలిగిస్తూనే బాగా నవ్విస్తోంది. మొత్తానికి రితేష్ ఇటు హాస్యాన్ని అటు సీరియస్ నెస్ ని మిక్స్ చేసి సినిమాని బాగా తీశాడు. హీరో శ్రీసింహా చాలా బాగా చేశాడు. డెలవరీ బాయ్ గా చాలా సహజంగా నటించాడు. ఇక కమెడియన్ సత్య తన కామెడీతో తెగ నవ్వించాడు. ఇక మిగిత నటినటులు చాలా బాగా చేశారు.

మైనస్ పాయింట్స్ : ఫస్ట్ ఆఫ్ ఉన్న ఫన్ సెకెండాఫ్ లో ఉండదు. కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం సినిమాకి మైనస్. రొటీన్ ట్విస్ట్ లు, అండ్ క్లైమాక్స్ మాములుగానే ఉన్నాయి.

మొత్తంగా : ఫైనల్ గా సినిమా ఆసక్తికరంగా సాగుతోంది. హీరో, కమెడియన్ సత్య అలానే కొన్ని సప్సెన్స్ ఎలిమెంట్స్ సినిమాలో బాగా అలరిస్తాయి. కామెడీని ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -