మెగా బ్రదర్ నాగబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం తెగ కష్టపడిపోతున్నాడు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనను ఏపీలో అధికారంలోకి తీసుకురావడానికి నాగబాబు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నాడు. దీనిలో భాగంగానే ఆయన పలు రాజకీయ నాయకుల మీద కామెంట్స్ చేస్తు సంచలనం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే జగన్, లోకేశ్‌లను కామెంట్స్ చేసిన నాగబాబు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేసుకుని ఓ వీడియోను విడుదల చేశాడు నాగబాబు. కొద్ది రోజులు క్రితం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతు బీజేపీ సభ్యులపై మండిపడ్డ సంగతి తెలిసిందే.
బీజేపీ తీరు చూస్తుంటే తన రక్తం మరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తన వీడియోలో ప్రస్తావించారు నాగబాబు. పాలు మరగడానికి నాలుగున్నర నిమిషాలు పడితే మన సీఎం రక్తం మరగడానికి నాలుగున్నరేళ్లు పట్టిందని ఫన్నీగా తన వీడియోలో చెప్పుకొచ్చారు నాగబాబు. ఎక్కువ మంట పెడితేనే పాలు మరుగుతాయి. ఎలక్షన్లు వస్తేనే చంద్రబాబు రక్తం మరుగుతుంది. థ్యాంక్యూ సీఎం అంటూ సెటైర్లు వేశారు నాగబాబు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’