నాగబాబు రోజా అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది జబర్దస్త్.ఓ టీవి ఛానెల్‌లో ప్రసారమైయ్యే ఈ ప్రోగ్రాంలో నాగబాబు రోజా గత నాలుగు సంవత్సరాలుగా జడ్జీగా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు ఇద్దరిలో ఒకరు షోకి రానప్పుడు ఆ రోజు కొంచెం వెలితిగా ఉండేది. ఇదిలా ఉంటే నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రాజకీయాలలో ఉన్నారు .అదేవిధాంగా రోజా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.రాజకీయలలో విమర్సలు ప్రతి విమర్సలు సర్వసాధారణం.ఇప్పుడు ఇదే మెగా బ్రదర్ నాగబాబుని బాగా ఇబ్బంది పెడుతుంది.పవన్, రోజా ఎపిసోడ్ మధ్య ఇప్పుడు నాగబాబు నలిగిపోతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ తో తెగ ఇబ్బంది పడుతున్నారు.
పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రోజాతో కలిసి జబర్దస్త్ అనే కామెడీ కార్యక్రమం చేస్తున్నాడీయన. అందులో పేలే జోకులకు ఇద్దరూ పడీపడీ నవ్వుకుంటారు. నాగబాబు అయితే మరీను. అతడి నవ్వుకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఓ బ్రాండింగ్ కూడా ఉంది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను “వాడు..వీడు” అనేశారు రోజా.
“చిరంజీవి అనే మెగాస్టార్ లేకపోతే పవన్ కల్యాణ్ ఎవడు..? పవన్ ను పెట్టి ఎవడు సినిమా తీస్తాడు..? ఎవడు చూస్తాడు..?” రోజా మాటల తూటాల్లో ఇది ఒక తూటా మాత్రమే. బండ్ల గణేష్ కు ఇదే నచ్చలేదు. ఏక వచనంలో తమ నాయకుడ్ని పిలవడం కోపం తెప్పించింది. అలా ప్రారంభమైన మాటల యుద్ధం “పక్కలు పరుస్తావ్” అని తిట్టుకునే స్థాయికి చేరింది.
ఇప్పుడు నాగబాబును లాగేస్తున్నారు నెటిజన్లు, పవన్ అభిమానులు. పవన్ ను అన్నేసి మాటలంటున్న రోజాతో కలిసి జబర్దస్త్ చేయొద్దనేది వీళ్ల వాదన. అసలు జబర్దస్త్ నుంచి రోజాని తీసేయాలని, లేదంటే నాగబాబు తప్పుకోవాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఓ సెక్షన్ వెళ్లి ఈ తతంగం మొత్తం నాగబాబు చెవిలో ఊదేసింది.నిజానికి పవన్ పై రోజా విమర్శలు చేయడం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలోనే చాలా చేశారు. అప్పుడు నాగబాబుపై పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. కానీ ఈసారి ఆ విమర్శలు హద్దులు దాటాయి. చిరంజీవితో పాటు మొత్తం మెగా కాంపౌండ్ హీరోల్నే అవమానించే రేంజ్ కు చేరుకున్నాయి.
ఈసారి నాగబాబు రియాక్ట్ అవ్వక తప్పదు. ఎప్పుడూ చెప్పినట్టే ఈసారి కూడా రాజకీయాలు వేరు, వినోదం వేరు అంటే కుదరదు. ఎందుకంటే ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ మాటల యుద్ధం రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు తీసుకోవడం ఖాయం. అలాంటప్పుడు పగలంతా పవన్, చిరంజీవిని తిట్టి సాయంత్రం తన పక్కకొచ్చి కూర్చునే రోజాతో కలిసి షో ఎంజాయ్ చేయడం ఎంతవరకు కరెక్టో నాగబాబు ఆలోచించుకోవాలి.