Tuesday, May 6, 2025
- Advertisement -

హీరోపై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసిన నీహారిక‌

- Advertisement -

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు #మీటూ ఉద్య‌మం ఉదృతంగా సాగుతుంది.అయితే ఈ ఉద్య‌మం కాస్తా స్లో అయింద‌నే స‌మయంలో ఎవ‌రో ఒక‌రు లైంగిక ఆరోప‌ణలు చేసి మ‌ళ్లీ ఈ మీటూను వార్త‌ల్లో నిలుపుతున్నారు. తాజాగా మాజీ మిస్ ఇండియా, హీరోయిన్ నీహారిక సింగ్ కూడా తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెట్టింది. బాలీవుడ్ విలక్షణ నటుడు నవజుద్ధీన్ సిద్ధిఖీపై ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.నవజుద్ధీన్ సిద్ధిఖీతో క‌లిసి నీహారిక సింగ్ గ‌తంలో ఓ సినిమాలో న‌టించింది.ఈ సినిమాతో వీళ్ల‌ద్ద‌రి మ‌ధ్య మధ్య పరిచయం ఏర్పడింది.

ఓరోజు సడెన్ గా మీ ఇంటి ముందు ఉన్నానని ఫోన్ చేశాడు. వెంటనే అతడిని ఇంట్లోకి ఆహ్వానించాను. అతడు ఇంట్లోకి రాగానే నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నేను ఎంతగా వదిలించుకుందామని చూసిన వదల్లేదు. ఆ సమయంలో నేను కూడా అతడితో క్లోజ్ అయిపోయాను. ఆ తరువాతే తెలిసింది అతడికి ఆల్రెడీ పెళ్లైందని, వరకట్న వేధింపుల కేసు ఉందని.. అంతేకాదు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది. నా ఫోన్ నుండే చాలా మందికి కాల్ చేసేవాడు. అడిగితే ఏవో కథలు చెప్పేవాడు. నాతో సెక్స్ రిలేషన్ పెట్టుకోవాలని చూశాడు. కామంతో అతడి కళ్లు కప్పుకుపోయాయి అని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -