పాలలాంటి తెలుపుతో ఉన్న నటి తమన్నా. తెలుగు, తమిళ్ ఇలా రెండు పరిశ్రమల్లో బిజీగా ఉన్న ఈ నటి ఇటీవల ఘోర అవమానం ఎదుర్కొంది. ఓ వ్యక్తి తనపై బూటు విసరడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన చాలా రోజులకు తమన్నా స్పందించింది. ఏం జరిగింది? తమన్నా ఏమన్నదో చూడండి.
హైదరాబాద్‌లో ఒక నగల దుకాణ ప్రారంభోత్సవానికి తమన్నా హాజరైంది. రిబ్బన్ కట్ చేసి షోరూంలోకి ఎంటరై అంతా అయిపోయిన తర్వాత బయట ఆమెను చూడడానికి వచ్చిన అభిమానులను తమన్నా పలకరించింది. అభిమానులతో మాట్లాడుతున్న సమయంలో హఠాత్పరిమాణం చోటుచేసుకుంది. తమన్నాపై కరీముల్లా అనే యువకుడు బూటు విసిరాడు.
ఈ ఘటన జరిగి చాలా రోజులైంది. ఎట్టకేలకు ఈ ఘటనపై తమన్నా స్పందిస్తూ.. కొంతమంది గిరి గీసుకుని ఉంటారని, ఆ గీత దాటి ప్రపంచం ఉందని భావించరని, వారి చర్యలతో ఇతరులు ఇబ్బంది పడతారని కూడా ఆలోచించరని చెప్పింది. అలాంటి వ్యక్తి కరీముల్లా అని పేర్కొంది.
ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని, తన విషయంలో కూడా అతడి స్పందన అలా ఉందని చెప్పింది. అతడు తనపై ప్లాన్ ప్రకారం దాడి చేయడానికి వచ్చాడని ఆరోపించింది. తాను ఎక్కువ సినిమాలు చేయడం లేదని అతనలా చేశాడని విన్నానని, దానికెలా స్పందించాలో తెలియడం లేదని పేర్కొంది.
అయితే ఈ దాడి కేసులో కరీముల్లాను అరెస్టు చేసి విచారించగా, తమన్నా ఎక్కువ సినిమాలు చేయడం లేదని బూటు విసిరి నిరసన తెలిపానని పోలీసులకు చెప్పినట్టు తెలిసిందే.