ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఐటి మినిష్టర్ కేటీఆర్, అతడి సోదరి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని స్ఫూర్తిగా నిలిచారు.ప్రముఖులతో పాటు టాలీవుడ్ దర్శకులు,హీరోలు ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని సామాన్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
వీరు గ్రీన్ ఛాలెంజ్ చేయడంతో పాటు,వేరే వారికి ఈ ఛాలెంజ్‌ను విసురుతున్నారు.తాజాగా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ స్టార్ హీరోలకు సవాల్ విసిరారు.ఎన్టీఆర్, ప్రభాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు లకు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనమని తలసాని సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్‌లో ఇప్పటికే మహేశ్.పవన్,చిరంజీవి,కాజమౌళి వంటి స్టార్స్ పాల్గొని ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు.